ప్రాణాలు హరించివేస్తున్న మయోనైజ్‌పై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. డా. బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియెట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో దామోదర రాజ నర్సింహా బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ కల్తీ ఆహార పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీల పనితీరుపై మంత్రి ఆరా తీశారు.