కాంగ్రెస్ పార్టీ నేతలకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని పీసీసీ ముఖ్యనేతలు నిర్ణయించారు. ఈ మధ్య కొందరు నేతలు తరచూ పార్టీని ఇబ్బంది పెట్టే స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు.