రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలోనే ఆదివారం కుక్కలు హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు పదుల సంఖ్యలో ఉండడంతో కలెక్టరేట్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వస్తున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడున్న వీధి కుక్కలు ఎవరిని ఎప్పుడు కరుస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలోని చెత్త బుట్టిలను సైతం కిందపడేసి చిందర వందరం చేస్తున్నాయి.