శంషాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గతంలో నార్కోటిక్ డ్రగ్స్ (గంజాయి) అక్రమ రవాణాలో వినియోగించి పట్టుబడిన ద్విచక్ర, త్రిచక్ర (ఆటోలు) వాహనాల వేలాన్ని ఈ నెల 27న నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ జి. దేవేందర్ రావు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలు స్టేషన్ ఆవరణలో నిర్వహించనున్నామన్నారు. ఆసక్తి గల ఈ వేలంలో పాల్గొని వాహనాలను పొందాలన్నారు.