వీధి కుక్కలతో వేగలేని పరిస్థితి ఉంటే వాటికి తోడుగా కోతుల గుంపు చేరింది. దీంతో మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు బయటకు వస్తే కుక్కల బాధ, ఇంట్లో ఉంటే కోతుల బాధ అన్న చందంగా మారిపోయిందని పలు కాలనీల ప్రజలు వాపోతున్నారు. సెక్రటేరియట్ కాలనీ, లాలమ్మగార్డన్, ఫ్రెండ్స్ కాలనీ, హుడా కాలనీ తదితర ప్రాంతాల్లో కోతుల గుంపు ఏకంగా గృహాల్లోకి చొరపడి చేతికి అందినవి తీసుకుని వెళ్తున్నాయని ఆయా కాలనీల వాసులు తెలిపారు.