రాజేంద్రనగర్: నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

65பார்த்தது
రాజేంద్రనగర్: నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
విద్యుత్ సంబంధ మరమ్మతు పనుల నిమిత్తం గగన్ పహాడ్, మైలార్ దేవ్ పల్లి విద్యుత్ సెక్షన్ ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఉదయం 11 నుంచి 11. 30 గంటల వరకు పద్మశాలీపురం, దుర్గానగర్ విద్యుత్ ఫీడర్ పరిధిలోని మధుబన్ కాలనీ, పద్మ శాలీపురం, ఆప్కో కాలనీ, టీఎన్జీవోస్, దుర్గానగర్, గణేష్ నగర్ లో విద్యుత్ ఉండదన్నారు.

దుర్గాహిల్స్ లోని శ్రీరామ నగర్ ఫీడర్ పరిధిలోని జల్ పల్లి పారిశ్రామికవాడ, శీవాజీ నగర్ లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయేషానగర్, అలీనగర్, అహ్మద్ నగర్, మిలాన్ కాల నీలో విద్యుత్ నిలిపివేస్తామన్నారు. తమిళ్ బస్తీ పరిధిలోలో మధ్యాహ్నం 12 నుంచి 12. 30 గంటల వరకు టాటానగర్, బృందావన్ కాలనీ, ప్రగతికాలనీలలో విద్యుత్ ఉండదన్నారు.

హిమాయత్ నగర్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు ఫీడర్ల పరిధిలో విద్యుత్ సంబంధ మరమ్మతు పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ అమర్ సింగ్ తెలిపారు. హైదర్షాకోట్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెంకటేశ్వర కాలనీ, డైమండ్ వ్యాలీ, ప్రశాంత్ నగర్, తిరుమల గార్డెన్, రాధా రిట్రీస్ ఫేస్-2, పావనీ హార్మోనీ విల్లాస్, పార్ట్ ఆఫ్ పద్మశ్రీహిల్స్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు.

మరమ్మతుల కారణంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మాధవినగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రీయ విహార్, ఎస్సీ బస్తీ, హైదర్షాకోట్ విలేజ్, మాధవినగడర్, శ్రీరామ్ నగర్, బృందావన్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఈ కోత ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி