మూసీ మే లూటో…ఢిల్లీ మే బాటో అనే విధంగా ఉన్నది కాంగ్రెస్ నేతల తీరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఉండాలంటే ఢిల్లీకి మూటలు పంపాలి. అందుకే మూసీలో డబ్బులు లూటీ చేసి, బ్యాగులు ఢిల్లీకి పంపుతున్నాడని కేటీఆర్ విమర్శించారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.