హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు పై టోల్ వసూలు చేసిన ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేట్ లిమిటెడ్, హెచ్ఎండీఏకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 శనివారం షాక్ ఇచ్చింది. రూ. 80 అధిక టోల్ ఛార్జీ వసూలు చేసినందుకు మెుట్టికాయలు వేసింది. ఫిర్యాదుదారుడికి రూ. 30వేల నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కింద రూ. 5వేలు మెుత్తంగా రూ. 35 వేలు చెల్లించాలని ఆదేశించింది. 45రోజుల్లో ఆ మెుత్తాన్ని చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.