వారం రోజుల క్రితం జీడిమెట్లకు చెందిన విద్యార్థి బానుప్రకాష్ లోన్ యాప్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే మంగళవారం మరో ఘటన పేట్ బషీర్ బాద్ పియస్ పరిధిలో జరిగింది. లోన్ యాప్ వేధింపులతో వినోద్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
తండ్రి అనారోగ్యంతో లోన్ యాప్‌లో తన భార్య పోటో పెట్టి రూ.2514 తీసుకున్నాడు. ఆ డబ్బుల కూడా కట్టేశాడు. అయితే లోన్ యాప్ నిర్వాహకులు వినోద్ ఇంకా డబ్బులు కట్టాలని వేధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో వినోద్ ఫోటోలను మార్ఫింగ్ చేసి నగ్న వీడియోలను, పోటోలను కుటుంబ సభ్యులకు పంపారు. దీంతో మనస్తాపం చెందిన వినోద్ ఆత్మహత్య పాల్పడ్డాడు.