రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం పరిధిలోని గురునానక్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో కొత్తగా ప్రవేశించిన ఎంబిఏ, ఎంసీఏ, బిసిఏ విద్యార్థుల కోసం శనివారం గ్రాండ్ ఓరియంటేషన్ డేని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఎల్. సాయి కుమార్ హాజరై ప్రసంగించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు మేనేజ్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ, చైర్మన్ సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ, డాక్టర్ హెచ్.ఎస్. సైనీ, రిజిస్ట్రార్ డా.తాడిశెట్టి శ్రీనివాసులు, జి.ఎన్.ఐ.టి.సి డైరెక్టర్ డా.ఎస్.శ్రీనాథరెడ్డి, జాయింట్ డైరెక్టర్ డా.పి.పార్థసారథి, జి.ఎన్.ఐ.టి ప్రిన్సిపల్ డా.కె.వెంకటరావు, అసోసియేట్ డైరెక్టర్ డా.రిషి సాయల్, కన్వీనర్ డా.రోస్ మేరీ, ఎంబిఏ విభాగాధిపతి డా.రవిశంకర్ పాల్గొన్నారు.