ఆ పని మాత్రం చేయొద్దు..అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

62பார்த்தது
ఆ పని మాత్రం చేయొద్దు..అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కళాశాలను ‘హైడ్రా’ కూల్చివేయబోతోందని వస్తున్న వార్తలపై తొలిసారిగా సోమవారం ఎంఐఎం శాసససభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టి పెట్టుకుని బండ్లగూడలో ఫాతిమా ఓవైసీ పేరున 12 భవనాలతో కళాశాలను నిర్మించానని తెలిపారు. ఇప్పుడు వాటిని కావాలనే కొందరు తప్పుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఫాతిమా ఓవైసీ కళాశాల జోలికి రావద్దని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி