కందుకూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, వైస్ చైర్మన్ విజేంద్రరెడ్డి ప్రారంభించనున్నారని సీఈఓ యాదగిరిరెడ్డి తెలిపారు. ఉదయం 11. 30 గంటలకు కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. వరి ధాన్యం ఏ గ్రేడ్ క్వింటాకు 2320, కామన్ గ్రేడ్ క్వింటాకు 2300, సన్న రకానికి 500 బోనస్ చొప్పున సేకరించనున్నట్లు తెలిపారు.