హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి సోమవారం మార్నింగ్ వాక్ లో భాగంగా కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు డివిజన్లోని షిరిడి నగర్ కాలనీలో పర్యటించి కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ కాలనీలో సరిపడా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ దీపాలు లేకపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇంటర్నల్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయాలని కోరారు.