హయత్ నగర్, బీ ఎన్ రెడ్డి నగర్ డివిజన్ల పరిధిలో దాదాపు 6 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి శనివారం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అని తెలిపారు.