మహిళా సంక్షేమానికి కృషి చేస్తానని హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అన్నారు. హయత్ నగర్ డివిజన్ పరిధిలోని కమలానగర్ లో నూతనంగా ఏర్పడిన మహిళా సంక్షేమ సంఘం సభ్యులు ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పుల్లమ్మ, రమణిరెడ్డి, ఇందిర, విజయనిర్మల, మహాలక్ష్మీ పాల్గొన్నారు.