విద్యార్థుల స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గ్యార క్రాంతి సోమవారం డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ లో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందన లేదన్నారు. ఇంత వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో విద్యార్థుల సమస్యలు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదన్నారు.