కార్వాన్: గుర్రపు డెక్క తొలగింపు పనులను పరిశీలించిన కార్పొరేటర్
కార్వాన్ డివిజన్ పరిధిలో దోమల వృద్ధిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ స్వామి యాదవ్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో గుర్రపు డెక్కల తొలగింపు పనులను పరిశీలించారు. త్వరగా పనులను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. పనులు పూర్తి అయిన తర్వాత దోమల నివారణ మందు పిచికారీ చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.