రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకల ఫామ్‌హౌస్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఇవాళ(ఆదివారం) ఆందోళన చేపట్టారు. దీంతో విల్లా దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జాయింట్ కమిషనర్ ఎక్సైజ్ ఖురేషి నేతృత్వంలో సోదాలు నిర్వహించడానికి వచ్చారు. అయితే ఎక్సైజ్ శాఖ సోదాలను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్యే వివేక్, బాల్క సుమన్, సంజయ్‌తో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా విల్లా వద్దకు చేరుకున్నారు.