చేవెళ్ల పట్టణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గంప జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు,
నిర్వాహకులు స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. పల్లకి సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.