కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక మెచ్యూరిటీ లేని లీడర్ అని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. నాయకత్వం వద్దని పక్కకు జరిగిన నేత రాహుల్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉపఎన్నికల్లో
కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేదన్నారు. అక్కడ
బీజేపీ తో మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతల ఇళ్ళమీద ఐటీ, ఈడీ రైడ్లు ఎందుకు జరుగలేదని పువ్వాడ మండిపడ్డారు. తమ ఇళ్లమీదనే ఎందుకు జరుపుతున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో భూమినుంచి ఆకాశం వరకు అన్నింట్లో కుంభకోణమే అని మండిపడ్డారు.