2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబరు 18న తొలి విడత, 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 14న జమ్మూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక, మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అక్టోబరు 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.