తెలంగాణలో భవిష్యత్తులో పాదయాత్ర చేస్తానని KTR చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. 'తనకు రాజకీయాలు బంద్ చేయాలని ఉందని కేటీఆర్ అంటున్నారు. అలాంటప్పుడు రాజకీయాలు బంజెయ్యు. ఎవరు వద్దన్నరు. వెళ్లి అమెరికాలో బాత్ రూమ్ లు కడుక్కో. అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్ ప్రజలకు కలిసే సమయం దొరకలేదు. మీ నాన్న 10 నెలలుగా ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఏమైనా నష్టం జరిగిందా?' అంటూ సెటైర్లు వేశారు.