గత BRS ప్రభుత్వంలో తప్పు చేసిన ఏ నాయకుడైనా శిక్ష అనుభవించక తప్పదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తప్పులు చేసినట్లు తేలితే KTR, హరీశ్ రావే కాదు, కేసీఆర్, కవితకు సైతం శిక్ష తప్పదని చెప్పారు. శుక్రవారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు అవుతానని ముందుగానే సిద్ధం అవుతున్నారని విమర్శించారు. గుమ్మడికాయల దొంగ అంటే కేటీఆర్ భుజాలు తడుముకుంటున్నారని అన్నారు.