నిజామాబాద్: గ్రూప్-3 పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి: సీఎస్
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 17, 18వ తేదీలలో జరుగనున్న గ్రూప్-3 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి సూచించారు. సీఎస్ శాంతికుమారి బుధవారం సాయంత్రం ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ కాన్ఫరెన్స్ లో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు.