నగరంలో గత వారం రోజులుగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండే దేవి రోడ్డు ప్రాంతంలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ గ్రహించిన వాసవి క్లబ్ అధ్యక్షుడు ప్రవీణ్ వాసవి క్లబ్ సభ్యులు స్వచ్ఛమైన చల్లని మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇంటర్నేషనల్ అధికారి విశ్వనాథం శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవి రోడ్ లో ప్రఖ్యాతిగాంచిన దేవి ఆలయం నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో చలివేంద్రం ఏర్పాటు చేసిన డాక్టర్ యెర్ర ప్రవీణ్. ఈ సందర్భంగా ఆయన అభినందించారు. పేదవారికి అవసరమైన మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన వారికి సూచించారు. ప్రోగ్రాం కన్వీనర్స్ గా పోకల శ్రీనివాస్. రాజా ప్రతాప్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆర్సి గదే సుదర్శన్, క్లబ్ కార్యదర్శి కున దయానంద్, కోశాధికారి కొవ్వూరి దిగంబర్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.