నిజామాబాద్ నగరంలోని లిబర్టీ పాఠశాల, లిటిల్ హాట్స్ పాఠశాలలో పదవ తరగతిలో 10 జిపిఎస్ సాధించిన విద్యార్థులను జిల్లా పరిషత్ అధ్యక్షులు దాదన్న గారి విట్టల్ రావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పదవ తరగతి అనేది వారి జీవితాలను మలుపు తిప్పే దశ అన్నారు.
విద్యార్థులు ఎంచుకునే మార్గం బట్టి వారు డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులుగా తయారవుతారని కాబట్టి కష్టపడి చదువకుండా ఇష్టపడి చదవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గోవర్ధన్, కరస్పాండెంట్ అర్చన, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.