ఏసిపి నీ మర్యాదపూర్వకంగా కలిసిన ఆడక్ కమిటీ సభ్యులు

659பார்த்தது
ఏసిపి నీ మర్యాదపూర్వకంగా కలిసిన ఆడక్ కమిటీ సభ్యులు
నిజామాబాద్ ఆర్య వైశ్య సంఘం (పట్టణ) మరియు అనుబంధ సంస్థల ఎన్నికలు సజావుగా సాగడానికి శాంతి భద్రతలకు ఏమాత్రం విఘాతం కలగకుండా అన్ని విధాలా సహకరించిన నిజామాబాద్ ఏసీపీ ముద్దసాని కిరణ్ ను తన కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసిన అడక్ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ న్యాయస్థానాలను గౌరవిస్తూ ఇతరుల హక్కులకు భంగం కలగకుండా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవహరించిన అర్హత కమిటీ సభ్యుల కు ఎన్నికల అధికారులకు సిబ్బందికి ఏసిపి కిరణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసీపీని కలిసిన వారిలో అధ్యక్షుడు విశ్వనాథం, శ్రీనివాస్, కార్యదర్శి మల్లేష్ కోశాధికారి సిద్ధంశెట్టి విజయ్, బ్రాహ్మణులపల్లి బాలదాస్, పార్శి కృష్ణంరాజు, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி