మండల కేంద్రంలో బుధవారం శివాలయ గోశాల వద్ద గ్రామానికి చెందిన పలువురు మహిళలు గో సేవలుచేశారు. ఈ సందర్భంగా ఈ రోజు పేడతో 1, 600 పిడకలు చేసి, గోవులను కడిగి, పరిసరాలను శుభ్రపరచి, మొక్కలు నాటి వనభోజనాలు చేశారు. గ్రామస్తులు వారిని అభినందించారు. వారం లో ఓ రోజు గోసేవ చేయడానికి ముందుకు వస్తున్న వారిని గోశాల కమిటీ స్థాపకుడు వరప్రసాద్ అభినందించారు.