ఆర్మూర్: రైలు పట్టాలపై మృతదేహం లభ్యం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం రైల్వే బ్రిడ్జి వంతెన వద్ద రైలు పట్టాలపై బుధవారం మృతదేహం లభ్యమైంది. మృతుడు ఆలూర్ మండల కేంద్రానికి చెందిన మల్లేష్ (గోసంగి) 24 వ్యక్తిగా గుర్తించారు. ట్రైన్ నడిపే పైలెట్ స్టేషన్ మాస్టర్ కు తెలపడంతో వారు పోలీసులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.