ఆలూర్: వరి కోతలు ప్రారంభమవడంతో కోసిన ధాన్యం ఆరబెట్టుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని దేగాం, మచ్చర్ల లాంటి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలకు సరిపడా స్థలాలు లేకపోవడంతో రైతులు రోడ్లపైనే ధాన్యం అరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలిస్తుంటారు. దీంతో వాహనాదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి దాన్యం అరబెట్టుకునేందుకు స్థలాలు ఏర్పాట్లు చేయాలని బుధవారం రైతులు కోరుతున్నారు.