Oct 23, 2024, 11:10 IST/
మంత్రి సురేఖవి అసత్యాలు: కేటీఆర్
Oct 23, 2024, 11:10 IST
TG: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు హాలులో జడ్జి ముందు BRS నేత కేటీఆర్ వాగ్మూలం ఇచ్చారు. ‘ఒక మహిళా మంత్రి అయ్యిండి.. నాపై అసత్య ఆరోపణలు చేశారు. ఆధారాలు లేకుండా మాట్లాడారు. నా పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేశానని అన్నారు. ఆమె వ్యాఖ్యలు అవాస్తవం. పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’’ అని చెప్పుకొచ్చారు.