దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో ఈ నెల 6న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా ర్యాలీగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన సందర్భంలో 30డీ యాక్ట్ ఉల్లంఘనపై వీడీసీ సభ్యులు వివరణ ఇవ్వాలంటూ గ్రామీణ సీఐ శుక్రవారం నోటీసు పంపారు. 30డీ యాక్ట్ అమలులో ఉన్నప్పుడు పోలీసు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని, వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.