లోకకల్యాణార్థం తుల్జాభవానీ పరివార్ పాదయాత్ర చేపట్టినట్లు భైంసా పట్టణానికి చెందిన భవాని భక్తుడు లఖన్ భయ్యా తెలిపారు. గురువారం భైంసాలోని గుజిరిగల్లీ నుంచి ఉదయం 4. 30 గంటలకు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర మహారాష్ట్రలోని ప్రసిద్ధ తుల్జాపూర్ భవానీ ఆలయం వరకు 310 కిలోమీటర్ల మేర నిర్వహించనున్నారు. 21 ఏండ్లుగా ఈ యాత్ర కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.