నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్రయవిక్రయాలు జరగవని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత కార్యదర్శి శ్రీనివాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమావాస్య, గాంధీ జయంతి సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి సెలవు ఉండడంతో భూసార బీట్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు, కమిషన్ దారులు, ఖరీదు దారులు గమనించి సహకరించాలని కోరారు.