భైంసా: రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

65பார்த்தது
భైంసా మండలం కామోల్లో సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉగాది పర్వదిన వేళ శ్రీరామనవమి వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక వేడుకలు జరగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ హాజరయ్యారు. గ్రామంలో శోభయాత్రలో పాల్గొని రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.

தொடர்புடைய செய்தி