రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వినతులు వెల్లువెత్తాయి. గురువారం నల్గొండ పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం క్యాప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నల్గొండ పటంతో పాటు నియోజకవర్గానికి చెందిన ప్రజలు వివిధ సమస్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కు వినతి పత్రాలు అందజేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.