ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వాన కాలం పండించిన ధాన్యం సేకరణ, కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్) సకాలంలో చెల్లించేందుకు జిల్లా రైస్ మిల్లర్లు సహకరించాలని కోరిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరిక మేరకు జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఏకగ్రీవంగా అంగీకరించింది. ఇదే విషయమై శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో, అలాగే కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రైస్ మిల్లర్లతో, జిల్లా కలెక్టర్, పౌరసరఫరాల అధికారులు సమావేశం నిర్వహించారు.