సరైన శాతం, నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు కేంద్రానికి దాన్యం వచ్చిన రోజే ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం ఆయన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.