సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో భాగంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం నల్గొండ జిల్లా, చండూరు మున్సిపల్ కేంద్రంలో సర్వే ప్రక్రియను తనిఖీ చేశారు. ఎన్యుమరేటర్లు సర్వే చేస్తున్న గృహాల వద్దకు వెళ్లి సరిగా చేస్తున్నదీ లేనిది పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె సర్వేకు సంబంధించి పారాలను, వాటిని పూరిచడం, వివరాల సేకరణ తదితర అంశాలపై మరోసారి ఎన్యుమరేటర్లకు స్పష్టంగా తెలియజేశారు.