కట్టంగూరు మండలానికి చెందిన ఆశా వర్కర్ తవిటి వెంకటమ్మ సిఐటియు అనుబంధ మండల ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా పనిచేస్తూ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో జరిగిన ఎన్నికల్లో జిల్లాప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు తెలిపారు. ప్రజా ఉద్యమాలు చేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని జిల్లాప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తవిటి వెంకటమ్మకి బాధ్యతలు మరింతగా పెరిగాయి అన్నారు.