హలో గీతన్న ఛలో యాదాద్రి : కల్లు గీత కార్మిక సంఘం మండల కార్యదర్శి దండేంపల్లి శ్రీనివాస్

1269பார்த்தது
హలో గీతన్న ఛలో యాదాద్రి : కల్లు గీత కార్మిక సంఘం మండల కార్యదర్శి దండేంపల్లి శ్రీనివాస్
కట్టంగూరు మండల కేంద్రం లో జరిగిన కల్లు గీత కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం సందర్బంగా *ఈనెల 19న యాదగిరిగుట్టలో జరిగే తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం మూడవ మహాసభ భారీ ప్రదర్శన బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లను కట్టంగూరు మండల కార్యదర్శి దండేంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల కమిటీ సభ్యులు, కల్లుగీత కార్మిక సంఘం సొసైటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కట్టంగూరు మండలం లోని కల్లుగీత కార్మిక సోదరులు గౌడ కులస్తులు వేలాదిగా తరలివచ్చి భారీ ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయగలరని కోరారు, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని కల్లుగీత కార్మికులకు బడ్జెట్లో 5000 కోట్లు కేటాయించాలని దళిత బందు గిరిజన బందు మాదిరిగానే కల్లుగీత కార్మిక కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రతి జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను ప్రతిష్టించాలని కల్లుగీత కార్మికులకు ఉచిత బైకులు ఇవ్వాలని ప్రతి జిల్లా కేంద్రంలో నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ప్రతి కల్లుగీత సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇచ్చి అందులో తాటి ఈత ఖర్జూర మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు ప్రభుత్వమే ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించాలని కల్లులోని పోషకాలను ఔషధ గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేయాలని మెడికల్ బోర్డు నిబంధన తొలగించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాద శ్రీను, సహాయ కార్యదర్శి పుట్ట గిరి, మండల కమిటీ సభ్యులు తండు సైదులు, మాద సైదులు, ముక్కిడి సైదులు, కొండ బిక్షం, తదితర సంఘం నాయకులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி