నాగార్జునసాగర్: సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకిస్తూ మాలల నిరసనలు, ధర్నాలు
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నల్లగొండ జిల్లా చైర్మన్ లకుమాల మధుబాబు అధ్యక్షతన నాగార్జునసాగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో చైర్మన్ తాళ్లపల్లి రవి హాజరై మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాలలందరూ నిరసనలు, ధర్నాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అన్నారు.