ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం సూరేపల్లి గ్రామంలో వెనిగండ్ల పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేనిగండ్ల పిఎసిఎస్ చైర్మన్ కె వి రామారావు, సూరేపల్లి తాజా మాజీ సర్పంచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.