వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత సంతానానిదే అని చౌటుప్పల్ తహసిల్దార్ ఎస్. హరికృష్ణ తెలిపారు. హైదరాబాదుకు చెందిన మదర్ తెరెసా సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరులోని సాయి యాదాద్రి వానప్రస్తాశ్రమంలో ఆదివారం ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు సమకూర్చిన రూ. 3 లక్షలు విలువైన నిత్యావసర సరుకులు, దుప్పట్లు, ఇతర వస్తువులను ఆయన చేతుల మీదుగా పోలీస్ ఇన్ స్పెక్టర్ మన్మధ కుమార్ తో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు.