నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంగళవారం నిషేధిత గుట్కా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. స్థానిక పాత బస్టాండ్ కూరగాయల మార్కెట్ ప్రాంతా లలో అక్రమంగా విక్రయిస్తున్న 11 లక్షల రూపాయల విలువచేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కిరాణం షాపు ముసుగులో అడ్డు అదుపు లేకుండా ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.