రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని చెన్నైపాలెం ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు పులిపాటి సత్యనారాయణ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పాఠశాలలో రాజ్యాంగ పరిరక్షణకు అందరూ పాటుపడాలని కోరుతూ విద్యార్ధిని విద్యార్ధులు, ఉపాద్యాయులచే ప్రతిజ్ఞ చేయించారు.