కోదాడ: మహిళ గొంతు కోసిన ఆర్ఎంపీ
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం నయనగర్ లో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ మహిళ గొంతు కోసిన వైనం భయభ్రాంతులకు గురి చేసింది. ఆర్ఎంపీ డాక్టర్ కు మహిళకు గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు దారి తీయడానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఆర్ఎంపీ దాడిలో గాయపడిన మహిళకు మెరుగైన చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.