అన్నదానాలు ఆధ్యాత్మికతకు ప్రతీకలు
అన్నదానాలు ఆధ్యాత్మికతకు ప్రతీకలని పురోహితులు వాసు శర్మ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని నయా నగర్ లో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా దాతలు పగిడిమర్రి మదన్మోహన్ సరస్వతి దంపతుల ఆర్థిక సహకారంతో నిర్వహించిన అన్నదానాన్ని అభినందిస్తూ మాట్లాడారు. దేవి శరన్నవరాత్రుల పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఉన్నారు.