ఈ నెల 6 వ తేదీ నుంచి జరిగే శాసనసభ వర్షాకాల సమావేశాలలో బీసీల సమస్యలు చర్చించాలని బీసీ యువజన సంఘం దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు చింతపల్లి సతీష్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో బీసీ మంత్రులు , ఎమ్మెల్యేలు ఉన్నా లేనట్టేనని అన్నారు. గత 5 సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్ ద సబ్సిడీ రుణాలు పెండింగ్లో ఉన్నాయని , రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కళ్ళల్లో వత్తులు పెట్టుకొని జిల్లా కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంబిసి కార్పొరేషన్ కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. ఐఐటి , ఐఐఎం , ఎస్ఐటి. మరియు ఇంజనీరింగ్ తదితర కోర్సులలో చదివే బీసీ విద్యార్థులకు ర్యాంక్ లతో సంబంధం లేకుండా పూర్తి ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు.