డిండి విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. సోమవారం సాంఘీక సంక్షేమ గురుకులంలో జోనల్ స్థాయి స్పోర్ట్స్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం యువతను ప్రోత్సహించేందుకు త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతోందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్ రావు, నాగార్జున రెడ్డి, ఎంపీడీవో, తహసీల్దార్, ప్రిన్సిపాల్ శిరీష తదితరులు పాల్గొన్నారు.